Monday 30 April 2012

తెలుగు-లఘు ప్రశ్నోత్తరాల నిధి -కె.పి.అశోక్‌కుమార్


‘‘తెలుగు’’ ప్రశ్నోత్తర కౌముది.
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు,
పి.సి.వెంకటేశ్వర్లు,
వెల. రూ.150; పే:271
హిమకర్ పబ్లికేషన్స్,
హైదరాబాద్.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత పరీక్షగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే బిఇడి, డిఇడి లేదా భాషా పండితులు తప్పనిసరిగా టెట్‌లో క్వాలిఫై కావాలి. ఇందులో లాంగ్వేజి మెథడాలజీ పేపరు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఎం.ఎ పాసైన తర్వాత జెఆర్‌ఎఫ్ ఫెలోషిప్ కోసం, యుజిసి లెక్చరర్స్ పోస్టులకోసం నెట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.

. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వారి నెట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్లేట్‌కు హాజరు కావచ్చు. ఇవి కాకుండా ఎపిపిఎస్‌సి నిర్వహించే లెక్చరర్ పోస్టులకు, ఇ తర పోటీ పరీక్షలను రాయడానికి తెలుగు ఒక ప్రధాన ఎంపిక చేసుకుంటారు. తెలుగు ఐచ్ఛిక విషయంగా ఎన్నుకుని పోటీ పరీక్షలు రాయడానికి నోట్స్‌రూపంలో ఎన్నో పుస్తకాలు మార్కెట్‌లోకి వచ్చాయి కాని ఆబ్జెక్టివ్ టైపులో వున్న పుస్తకాలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. గతంలో తెలుగు అకాడమీ వారు వేసిన ప్రశ్నోత్తరాల ని ధి చాలావరకు విద్యార్థుల అవసరాలను తీ ర్చింది. ద్వానాశాస్ర్తీ లాంటి వాళ్లు కూడా ఇ లాంటి ఆబ్జెక్టివ్ టైపు పుస్తకాలను తీసుకు వచ్చా రు. ప్రస్తుతం ప్రతి దినపత్రిక విద్య, ఉద్యోగావకాశాలపై ప్రతిరోజు-ప్రతి వారం అనుబంధాల ను ప్రచురిస్తున్నవి. ఇందులో తెలుగు సాహిత్యంపై ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలతో పూర్తి పేజీని అందచేస్తున్నాయి. తాజా సమాచారంతో వచ్చే ఈ పేపర్లు విద్యార్థులకు మంచి రెఫరెన్స్‌గా ఉ పయోగపడుతున్నాయి. ఇవి కాకుండా లెక్చర ర్స్ పరీక్ష సిలబస్‌ను, నెట్ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, డా.పి.సి.వెంకటేశ్వర్లు అనే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొత్తగా రూపొందించిన లఘు ప్రశ్నోత్తరరాల నిధి ఇది. ఇందులో ప్రాచీన-ఆధునిక తె లుగు సాహిత్యాలు సాహిత్య విమర్శ, తెలుగు వ్యాకరణం, భాషా శాస్త్రాలకు తోడుగా సంస్కృ త సాహిత్యం-చరిత్రలను అదనంగా జోడించారు. ఈ బహుళ ప్రశ్నోత్తరాల నిధిని అధ్యాయాల విభజన, ఉప శీర్షికా విభజనగా త యారు చేయడం విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అన్నిరకాల పరీక్షల ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విద్యార్థుల అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రశ్నోత్తరాల నిధిని తయారు చేసామని సంకలన కర్తలు చెప్పుకోవడం గమనించదగ్గ విషయం.
-కె.పి.అశోక్‌కుమార్
http://archives.andhrabhoomi.net/askhara/t-056

1 comment: