Monday, 30 April 2012

తెలుగు సాహిత్యంలో గణపతి - బూదాటి వెంకటేశ్వర్లు


తెలుగు సాహిత్యంలో గణపతి

మన కావ్య ప్రబంధాల్లో దేవతాస్తుతుల్లో భాగంగా గణపతి స్తుతి కూడా చోటుచేసుకుంది. ఆ అధినాయకుని తెలుగు పద్య కవులు ఎంతో హృద్యంగా వర్ణించారు. గణపతిపై ప్రత్యేకంగా పద్యం చెప్పిన కవులు తక్కువే- వాటిని ఒకసారి స్మరించుకుందాం.
అల్లసాని వారి అల్లిక:
"అంకము జేరి శైల తనయాస్తనదుగ్ధము లానువేళబా
ల్యాంకవి చేష్ట దొండమున నవ్వలిచన్ గబళింపబోయి, యా
వంకకుచంబుగానకహి వల్లభహారము గాంచి వేమృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తునభీష్ట సిద్ధికిన్''
పరమశివుడు అర్ధనారీశ్వరుడు గదా! ఆ రూపంలో వున్నపుడు ఎడమవైపున్న పార్వతి వద్ద గణపతి పాలను త్రాగుతున్నాడు. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని పెద్దన చేసిన చమత్కారం మనల్ని అలరిస్తుంది. పసిబిడ్డలు తల్లి ఒడిని చేరి ఒక వంక చనుబాలు తాగుతూ వేరొకవంక ఉన్న స్తనాన్ని చేతితో పుణకటం సహజం పార్వతీదేవి వద్ద పాలు తాగుతున్న బాలగణపతి చేసే పసితనపు చేష్టను పెద్దన చమత్కరించాడు. అలా ఒకవైపు తాగుతున్న గణపతి రెండవవైపు తాగడానికి తొండాన్ని చాచాడు. ఆ వైపు స్తన్యము కనిపించలేదు. సర్పహారాలు కనిపించాయి. దానిని లేత తామరతూడనుకొని తొందరగా పట్టుకోబోతున్నాడు. అలాంటి విఘ్నేశ్వరుని నా కోరికలెల్ల సిద్ధించుటకై సేవిస్తానని పెద్దన స్తుతించాడు. ఈ పద్యంలోని వినాయకుని భ్రాంతి, మనుచరిత్రకథలోని వరూధిని భ్రాంతికి సూచన అంటారు విమర్శకులు.

తెలుగు-లఘు ప్రశ్నోత్తరాల నిధి -కె.పి.అశోక్‌కుమార్


‘‘తెలుగు’’ ప్రశ్నోత్తర కౌముది.
ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు,
పి.సి.వెంకటేశ్వర్లు,
వెల. రూ.150; పే:271
హిమకర్ పబ్లికేషన్స్,
హైదరాబాద్.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత పరీక్షగా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను కొత్తగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే బిఇడి, డిఇడి లేదా భాషా పండితులు తప్పనిసరిగా టెట్‌లో క్వాలిఫై కావాలి. ఇందులో లాంగ్వేజి మెథడాలజీ పేపరు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఎం.ఎ పాసైన తర్వాత జెఆర్‌ఎఫ్ ఫెలోషిప్ కోసం, యుజిసి లెక్చరర్స్ పోస్టులకోసం నెట్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి.

ముద్రిత రచనలు

మువ్వల సవ్వడి, ఆనంద శాఖి, తెలుగు బోధన సమస్యలు-పరిష్కారాలు, ఆధునిక భాషా బోధన సందర్బంలో చిన్నయ సూరి, చేమకూరి విజయ విలాసం (వచనంలో), సర్పయాగం (భారత కధ), భాగవతం (ఛతుర్ధ స్కంధ వాఖ్య), తాళ్ళసాక పెదతిరుమలాచార్యని, నీతి సీస శతక వ్యాఖ్యానం, భారతీయ గ్రంధ పరిష్కరణ పద్దతులు, భోగిని దండక వ్యాఖ్యానం, లోనారసి, పోటీ పరీక్షల కోసం తెలుగు సాహిత్య చరిత్ర, (సాహిత్య ప్రక్రయా అధ్యయనం) మొదలగునవి

ఆచార్య. బూదాటి.వెంకటేశ్వర్లు

ఎం.ఏ నాగార్జన విశ్వవిద్యాలయంలో చదివారు. ఎం.ఏ లో రెండు బంగారు పతకాల్ని పొందటమే కాకుండా, నాగార్జున విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో మొట్ట మొదటగా యు.జి.సి వారు నిర్వహించే నెట్ పరిక్ష ఉత్తీర్ణులై ఫెలోషిప్ (జె ఆర్ ఎఫ్ ) ను పొందారు. పరిశోధన కోసం ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కు వెళ్లి హరి వంశము-ఎఱ్ఱన, సోమనల తులనాత్మక పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పొందారు.